r/telugu • • May 10 '26 Bravo Heartwarming

Telugu poetry competition 2026

Post image
148 Upvotes

u/AndhraAatma is winner of the r/telugu Poetry Competition 2026 for the poem "​మాట"

Special mention for the below poems (from the moderators)

full list of submitted poems can be found here

With this, we conclude the r/telugu Poetry Competition 2026. We sincerely thank all the participants, readers, and up-voters who made this event lively. Hope you enjoyed the journey, and let’s meet again in 2027!

​​మంచి గుమ్మడి కన్న దంచిన ఎర్రని
క్రొవ్వొడ్ల బియ్యపు కూడుకన్న
మేల్‌ జహంగీరు మామిడి పండుకన్న సుం
కారిన లేసజ్జ కంకికన్న
కమియపండిన ద్రాక్షకన్న చక్కెర తగ
బోసివండిన పాలబువ్వకన్న
రస దాడికన్న పనసతొన కన్న క
ర్జూరముకన్నను జున్ను కన్న
అరటి పెరతేనియల కన్న ఆమని తరి
​కొసరి కూసె కోయిల కూతకన్న
ముద్దు లొలికడి జవరాలిమోవికన్న
​తీయనైన దెయ్యది? అదే తెనుగు బాస​
-ముదిగొండ వీరభద్రమూర్తి


r/telugu • • Sep 26 '22

Resource List for Learning Telugu

148 Upvotes

Hi Languages Enthusiasts,

Do you want to learn Telugu but don’t know where to start? Then I’ve got the perfect resource list for you and you can find its links below. Let me know if you have any suggestions to improve it. I hope everyone can enjoy it and if anyone notices any mistakes or has any questions you are free to PM me. Here is what the resource list contains;

  1. Resources on certain grammar concepts for easy understanding.
  2. Resources on learning the script.
  3. Websites to practice reading the script.
  4. Documents to enhance your vocabulary.
  5. Music playlists
  6. List of podcasts/audiobooks And a compiled + organized list of websites you can use to get hold of grammar!

https://docs.google.com/document/d/1V3juapEE7-vTZxoZikC5TwFahEfkexv4USvc675ItT8/edit?usp=sharing


r/telugu • • 2d ago Bravo

బొమ్మ - photo/video 📷🎥 తందనాన భళా తందనాన

594 Upvotes

Annamacharya (1408-1503): Brahmam Okkate (బ్రహ్మమొక్కటే · Brahmamokkate · Brahma Mokate) Arranged by Vineel Garisa Mahal

Recorded live on 29 June 2026 at Stadtkirche St. Martin, Rheinfelden (Solsberg Festival 2026)

OG on youtube channel

Vineels youtube channel is gold.

Do check it out


r/telugu • • 21h ago

పొత్తం - book 📖 Vennello Aadapilla by Yendamuri garu

Post image
1 Upvotes

r/telugu • • 1d ago

వ్యాసం - article రుద్రవీణ, వసంతకోకిల

Thumbnail medium.com
2 Upvotes

r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ What does this say?

Post image
15 Upvotes

I found it in a math book.


r/telugu • • 1d ago

బొమ్మ - photo/video 📷🎥 Part 1 : He Refused to Bow to Ramana Maharshi. Then One Smile Changed Ev...

Thumbnail youtube.com
2 Upvotes

r/telugu • • 2d ago

పద్యము - verse లేమా! తెలుగును రాయగ లేమా?

Post image
35 Upvotes

లేమా, తెలుగును రాయగ

లేమా? నీవేల తెలుగు లేఖిని పట్టవు?

లేమా, తెలుగును పలుకగ

లేమా? తెలుగందుకొనుము లీలం కేలన్


r/telugu • • 1d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu mini crossword # 54 - ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
2 Upvotes

r/telugu • • 2d ago

బొమ్మ - photo/video 📷🎥 భారతదేశానికి బయట, ఏ దేశంలో ఒక ప్రాంతీయ తెగకు చెందిన ప్రజలు తెలుగును తమ మాతృభాషగా మాట్లాడుతారు

Post image
34 Upvotes

r/telugu • • 2d ago

కవిత - poetry 🪶 చిన్న తవిక!

7 Upvotes

కవిత్వం ధనవంతుల కళ,

పేదోడికి అంత తీరికెక్కడ

దరిద్రం భావజాలానిదిది,

పేదరికం కేవలం ఐశ్వర్యానిది కాదు కదా

తన గొంతు వినిపించే హక్కున్నోడు,

ఆ పేదోడి మూగవేదనకి గొంతుకెక్కడ

సంపద దోపిడీలో మునిగారు వారు,

ఆ ధనవంతులకు వీటన్నింటి కొరకు తీరికెక్కడ


r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ ఱ

5 Upvotes

How do you pronounce it

Is it rauthi or bandiraaa

In my school i learnt it as bandiraa but recently I got to know that few people also call it as rauthi which felt like a new thing.

Nenu bandiraa anagane maa friends padi padi navvaru

Vaalu rauthi anagane felt funny to me.

We both are from telangana


r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Name some Polymaths from Telugu regions

5 Upvotes

r/telugu • • 2d ago

మాటామంతీ - discussion Has a time-and-place rule worked for teaching kids a heritage language, like "only Telugu at dinner"?

1 Upvotes

Full disclosure: I work on Mulabhasha, a Telugu-learning platform. I'm asking this as a question, not a pitch.

A parent asked us how to get her child to use Telugu words consistently, not just understand them.

We suggested picking a specific time or place, like dinner, where the family speaks only Telugu, so the child connects words to actions.

For those of you raising kids with a heritage language: did something like this work? Which time or place worked best, and what went wrong?


r/telugu • • 3d ago

మాటామంతీ - discussion మన పిల్లలకు తెలుగు ఎందుకు రావట్లేదు? అసలు తప్పు పిల్లలదా, మన విద్యావ్యవస్థదా? (ఒక ఆలోచన)

16 Upvotes

మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉంటూ, తెలుగులోనే మాట్లాడుతూ కూడా చాలామందికి సొంత పేరు కూడా తెలుగులో తప్పులు లేకుండా రాయడం రావట్లేదు. ఇంకా దారుణం ఏంటంటే — ఇంగ్లీష్ రాకపోతే చిన్నతనంగా ఫీలయ్యే మన సమాజంలో, "నాకు తెలుగు చదవడం, రాయడం రాదు" అని చాలామంది ఎంతో స్టైల్‌గా, గర్వంగా చెప్పుకుంటున్నారు.

దీనికి తోడు మార్కులు తగ్గుతాయనే భయంతో తల్లిదండ్రులు తెలుగును సెకండ్ లాంగ్వేజ్‌గా కూడా వదిలేసి సంస్కృతం, హిందీ వైపు వెళ్తున్నారు. ఫోన్లలో కూడా అంతా Tenglish (ela unnav, em chestunnav) అయిపోయింది.

అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? పిల్లలకు తెలుగు అంటే ఎందుకు ఇంత భయం, బద్ధకం?

నిజానికి ఏ భాషనైనా పిల్లలు మొదట వినడం, మాట్లాడటం ద్వారా నేర్చుకుంటారు. ఆ తర్వాతే చదవడం, రాయడం రావాలి. కానీ మన బడుల్లో పిల్లవాడు అడుగుపెట్టగానే "ఇది సవర్ణదీర్ఘ సంధి, ఇది అకారాంత పుంలింగ శబ్దం" అంటూ కఠినమైన వ్యాకరణాన్ని రుద్దుతున్నారు. దాంతో మొదటి అడుగులోనే భాషపై విసుగు, భయం పుడుతున్నాయి.

దీనికి బదులుగా, తెలుగు నేర్పించే పద్ధతిని ఒక 3 సులభమైన దశల్లో మారిస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయని నా అభిప్రాయం:

1. మొదటి దశ — స్వేచ్ఛగా రాయనివ్వాలి (మాట్లాడే భాషలో): పిల్లలకు మొదట ఒత్తులు, దీర్ఘాలు పట్టించుకోకుండా "నువ్వు ఇంట్లో ఎలా మాట్లాడతావో, నీకు ఏది అనిపిస్తే అది అలాగే రాయి" అని ప్రోత్సహించాలి. ఎర్ర పెన్నుతో తప్పులు కొట్టేయకూడదు. దీనివల్ల "నాకు తెలుగు రాయడం వచ్చు" అనే ఆత్మవిశ్వాసం పిల్లల్లో పెరుగుతుంది, బద్ధకం పోతుంది.

2. రెండో దశ — ఆసక్తికరమైన కథలతో సరిదిద్దాలి: పిల్లలు రాయడం మొదలుపెట్టాక, తప్పులను కేవలం "ఇది తప్పు" అని కాకుండా ఒక కథలా చెప్పాలి.

  • ఉదాహరణకు: పిల్లవాడు 'సంతోషం' బదులు 'సంతోసం' అని రాశాడనుకోండి.
  • అప్పుడు "చూడు నాన్నా, మనం మాట్లాడేటప్పుడు 'స' అంటాం కానీ, ఇది మన సొంత తెలుగు పదం కాదు. పక్కనున్న సంస్కృతం అనే పాత భాష నుండి మన దగ్గరికి వచ్చింది. వాళ్ళు 'ష' అని పలుకుతారు కాబట్టి మనం కూడా వాళ్ళకు గౌరవం ఇస్తూ 'ష' అని రాస్తాం" అని చెబితే పిల్లవాడి మెదడు దాన్ని ఎప్పటికీ మర్చిపోదు!
  • అలాగే రోజువారీ వాడే స్కూలు, బస్సు ఇంగ్లీష్ పదాలు అని; ఆకాశం, రత్నం సంస్కృత పదాలు అని; అమ్మ, నాని మన సొంత తెలుగు పదాలు అని పరిచయం చేస్తే వ్యాకరణం ఒక డిటెక్టివ్ గేమ్‌లా మారుతుంది.

3. మూడో దశ — మాండలికం (Dialect) vs ప్రామాణిక భాష (Standard Spelling): చాలా ప్రాంతాల్లో 'శక్తి'ని 'సెత్తి' అని, 'సంతోషం'ని 'సంతోసం' అని మాట్లాడతారు. మాట్లాడేటప్పుడు అది వంద శాతం సరైనదే, దాన్ని ఎవరూ తప్పు పట్టకూడదు.

  • పిల్లలకు ఈ తేడాను సులభంగా చెప్పాలంటే 'దుస్తుల ఉదాహరణ' వాడాలి: "మనం ఇంట్లో సౌకర్యంగా ఉండే బట్టలు వేసుకుంటాం, బయటకు వెళ్ళినప్పుడు యూనిఫాం వేసుకుంటాం కదా? అలాగే మనం మాట్లాడేటప్పుడు మన ఊరి యాసలో 'సెత్తి', 'సంతోసం' అంటాం. కానీ అందరికీ అర్థమయ్యేలా పుస్తకాల్లో రాసేటప్పుడు మాత్రం భాషకు ఉండే యూనిఫాం వేయాలి — అదే 'శక్తి', 'సంతోషం'".
  • ఇలా చెబితే పిల్లలకు తమ సొంత యాసపై న్యూనతాభావం కలగదు, అదే సమయంలో అందరికీ అర్థమయ్యే ఉమ్మడి స్పెల్లింగ్ (Standard Spelling) ఎందుకు నేర్చుకోవాలో అర్థమవుతుంది.

గిడుగు రామమూర్తి పంతులు గారు ఒకప్పుడు "వ్యావహారిక భాషోద్యమం" చేసింది కూడా ఇందుకే — గ్రాంథిక భాష అనే ఇనుప కంచెను దాటి, సహజమైన తెలుగులోనే చదువు ఉండాలని.

నా ప్రశ్న ఏంటంటే: విద్యాశాఖ వాళ్ళు కరిక్యులమ్‌లో ఇలాంటి చిన్న మార్పులు ఎందుకు చేయరు? ఇంత సులభంగా, ఆసక్తికరంగా నేర్పిస్తే ఏ పిల్లవాడైనా తెలుగును ఎందుకు వదులుకుంటాడు?

దీనిపై మీ అభిప్రాయం ఏంటి? మన విద్యావిధానంలో ఇంకా ఏం మారితే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు?

TL;DR: మన బడుల్లో పిల్లలకు మొదటే కఠినమైన వ్యాకరణం రుద్దడం వల్ల తెలుగుపై భయం, విసుగు పుడుతున్నాయి. దానికి బదులు: (1) ముందు వారి ఊరి యాసలో స్వేచ్ఛగా రాయనిచ్చి ఆత్మవిశ్వాసం పెంచాలి, (2) ఆ తర్వాత పదాల మూలాలను (తెలుగు, సంస్కృతం, ఇంగ్లీష్) కథల్లా చెబుతూ తప్పులు దిద్దాలి, (3) ఇంటి భాష (మాండలికం) vs పుస్తక భాష (యూనిఫాం) మధ్య తేడాను సులభంగా వివరిస్తే పిల్లలు తెలుగును ఇష్టపడి నేర్చుకుంటారు.


r/telugu • • 2d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu mini crossword # 53 - ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
2 Upvotes

r/telugu • • 3d ago

ఇతరము - other చిరు మనవి

2 Upvotes

అందరికి నమస్కారం , పద్యాల గురించి వాటిని ఎలా వ్యాకరణ దోషం లేకుండా వ్రాయాలి వంటివి తెలిపే వనరులు మరియు వాట్సాప్ లో లేదా ఇతర మాధ్యమాల్లో శిక్షణ ఇచ్చే గ్రూప్స్ ఉంటే ఇక్కడ పెట్టమని మనవి . ఆసక్తి ఉన్నవాళ్ళకి ఉపయోగ పడుతుంది. ధన్యవాదాలు.


r/telugu • • 3d ago

మాటామంతీ - discussion Please, Support my YouTube channel - దయచేసి నా YT చానెల్ ని ప్రోత్సహించండి

Thumbnail youtube.com
1 Upvotes

నేనొక యూట్యూబ్ చానెల్ మొదలు పెట్టి 4 సంవత్సరాలు అవుతోంది. మొదటి రెండు సంవత్సరాలు విధిగా ప్రతిరోజు వీడియొలు పెట్టె వాడిని, కాని కొన్ని వ్యక్తిగత మరియు వృత్తి పరమైన కారణాల వల్ల 2 సంవత్సరాలు పట్టించుకోలేదు. నా చానెల్ లో పిల్లల చదువుతో పాటు పెద్దలకు జ్ఞానాభివృద్ది పెరుగుదల కోసం వీడియొలు చేస్తున్నాను.

నాకు తెలుగు మీద ఉన్న మక్కువ కొద్ది, వేమన అంటే ఉన్న గౌరవం కొద్ది వేమన పద్యాలు చాలా చేశాను. మన చానెల్ లో ఉన్నన్ని వేమన పద్యాలు అర్థ వివరణతో నాకు తెలిసి మరెక్కడా లేవు. అమెరికాలో ఉన్న నా స్నేహితుడు నేను చేసే వీడియొలు వారి అబ్బాయికి చూపిస్తూ ఉంటాడు అట. అది విన్నప్పుడు ఎంతో సంతోషం వేసింది.

ఎప్పటినుండో చేస్తున్న వేమన పద్యాలు కొనసాగిస్తూనే, స్పోకెన్ ఇంగ్షీషు, మిగతా శతక పద్యాలు, క్లాస్ రూమ్ వీడియొలు, ఇంకా మరెన్నో వీడియొలు రాబోతున్నాయి.

దయచేసి నా చానెల్ ని ఒకసారి చూడండి, మీకు నచ్చిన వాటిని Like చేసి, నచ్చితే చానెల్ subscribe చేసుకోగలరు.

మీ అభిప్రాయాలు నిర్మొహమాటంగా తెలియజేయగలరని మనవి.

ధన్యవాదాలు.

Pushtaka Gnanam | పుస్తక జ్ఞానం


r/telugu • • 4d ago Heartwarming

కథ - story మా అమ్మ ఏం చేస్తుందని అడిగితే, "గృహిణి" అని చెప్పాలనిపించదు. అందుకే ఇదంతా రాశాను. అమ్మకి 51 ఏళ్లు.

40 Upvotes

ఒక మధ్యాహ్నం, ఆమె బ్లౌజ్ కుడుతూ, చిన్న చిన్న కుట్లను ఎంతో శ్రద్ధగా సరిచేస్తూ ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత అవే చేతులు గుమ్మం బయట ముగ్గులు వేస్తుంటాయి. పండుగల సీజన్ వచ్చిందంటే, తన కోలాటం గ్రూపుతో బయల్దేరిపోతుంది. పల్లకీ ఊరేగింపుల్లో ఆడుతుంది, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటుంది. రంగురంగుల పూలతో బతుకమ్మ అంటే ఆమెకి ప్రాణం, ఉత్సాహంతో ఊగిపోయే బోనాలన్నా అంతే.

ఇంకో వైపు, యాభై ఒకటో ఏట కూడా తెలంగాణ రాష్ట్రస్థాయి యోగా పోటీలకు తిరుగుతూనే ఉంది. ఆ ప్రయాణాల మధ్యలో నాకు ఫోన్ చేసి, "ఇంకో సెట్ నోట్స్ ప్రింట్ తీసివ్వరా" అంటుంది. సౌందర్య లహరి, శివానంద లహరి, అభిరామి, ముకపంచశతి. కాలేజీ పిల్లలా నోట్ బుక్ పట్టుకుని కూర్చుంటుంది. ఆన్‌లైన్ క్లాసులు వింటుంది, శ్లోకాల కింద గీతలు పెట్టుకుంటుంది, ఉచ్చారణ ప్రాక్టీస్ చేస్తుంది. తర్వాత ఆ రోజు క్లాసులో ఏం జరిగిందో చెప్తుంది. నేను పెద్దగా పట్టించుకోనట్టు ఉంటాను కానీ, వింటాను. ఒక్కోసారి ఆమెని ఆటపట్టిస్తా కూడా: "క్లాస్ అయిపోయిందా? ఎగ్జామ్ ఎప్పుడు? హాల్ టికెట్ వచ్చిందా?"

కొన్ని సాయంత్రాలు ఒక్కతే వెళ్లి తన ఫేవరెట్ పానీపూరీ తింటుంది. మధ్యాహ్నం హాయిగా ఒక కునుకు తీస్తుంది. ఇంకొన్ని సాయంత్రాలు నెట్‌ఫ్లిక్స్‌లో సినిమానో, సిరీస్సో పెట్టుకుని కూర్చుంటుంది. నన్ను సలహాలు అడుగుతుంది, చూశాక రివ్యూ ఇస్తుంది: "ఏం బాలేదు, చెత్త సినిమా. సమాజం ఏమైపోతుంది అసలు! ఎటు చూసినా ప్రేమ, మోసం, అఫైర్లు, చంపడం, నరకడం, రేపులు... ఇవేనా?"

ప్రతి కొన్ని నెలలకి ఒకసారి బ్యాగ్ సర్దుకుని, తన గుడి గ్రూపుతో సేవకి వారం, పది రోజులు వెళ్లిపోతుంది. ఎవర్నీ అడగదు. "నేను వెళ్తున్నా" అంతే. మేమేమైనా అంటే, "మీ చావు, మీరు చావండి" అంటుంది. తిరిగి వచ్చేటప్పుడు కథలతో, నవ్వులతో వస్తుంది.

ఇంకోసారి ఏమైందంటే, ఎన్నో రకాల వంటలు చేసి, డబ్బాల్లో సర్దుతూ, ఆపకుండా ఫోన్లో మాట్లాడుతూ, చక్కగా తయారై ఉంది. నేను అడిగాను, "ఎక్కడికి వెళ్తున్నావ్?"

"పిక్నిక్!" అంది.

పాత స్కూల్ ఫ్రెండ్స్ అందర్నీ వెతికి పట్టుకుని వాట్సాప్ గ్రూపు పెట్టేసింది. కొన్ని రోజుల్లోనే పిక్నిక్ ప్లాన్ చేశారు. ఇంటి వంటలు తీసుకెళ్లారు, ఆటలు ఆడారు, సెల్ఫీలు తీసుకున్నారు, రోజంతా మాటలు, నవ్వులతోనే గడిపారు. తిరిగి వచ్చాక తీసిన ఫోటోలన్నీ ఒక్కొక్కటిగా చూపించింది. ఎవరెవరు ఎవరో, ఏమేం చేశారో అన్నీ చెప్పింది.

ఎవరైనా తన గురించి చెడుగా మాట్లాడారని తెలిస్తే, నేరుగా వాళ్ల దగ్గరికే వెళ్లి, ఎందుకలా అన్నారని అడిగేసేది. కొందరు సర్దిచెప్పి, వివరణ ఇచ్చుకునేవాళ్లు. మరికొందరు ఇబ్బందిగా చూసేవాళ్లు. అలా నేరుగా వెళ్లి ఎలా అడగగలుగుతుందా అని నేను చూస్తూ ఆశ్చర్యపోయేవాడిని.

ఇంట్లో పనులన్నీ మాతోనే చేయించేది. గిన్నెలు కడగడం, బట్టలు ఉతకడం, ఊడ్చడం, తుడవడం, సరుకులు తేవడం, వంట. మేము కూరగాయలు కోసిచ్చే దాకా వంట మొదలుపెట్టేది కాదు.

నేను చెయ్యనని అంటే, "దొంగ బాడ్‌కౌ, చెయ్యి రా" అనేది. ఒక్కోసారి చీపురుతో కొట్టేది కూడా. నాకైతే బాల కార్మికుడిలా అనిపించేది.

కొందరు పిల్లలు అల్లరి చేస్తూ, మాట వినకుండా, ఇంకా ముద్దు చేయమని అడుగుతూ ఉంటే ఆమె అంటుంది: "లాడుల బిడ్డకి జాడుల దెబ్బలు!"

నాకు తెలుగు వచ్చేది కాదు. దీర్ఘాలు, ఒత్తులతో ఎప్పుడూ తడబడేవాడిని. తన కుట్టు మెషీన్ పక్కన కూర్చోబెట్టి చదివించేది, ప్రతి తప్పు పదాన్ని సరిదిద్దేది. బ్లౌజ్‌లో ఆమె వేసిన ప్రతి కుట్టుకి నాకు అన్ని తిట్లు, అన్ని దెబ్బలు పడ్డాయని అనుకుంటా.

తర్వాత ఆమె కథలు చెప్పడం ఇప్పటికీ గుర్తుంది. రోజంతా పని అయ్యాక, మాకు రామాయణం, మహాభారతం చెప్పేది. నేను "ఊ... ఊ..." అంటూ ఉండేవాడిని. నాకు నచ్చిన ఒకేఒక్క "ఊ" అదే.

ఆమె గొంతు కూడా చాలా మధురంగా ఉంటుంది. ఆమె పాడే విఘ్నేశ్వర హారతి నాకు చాలా ఇష్టం. ఒక్కోసారి ఒంటరిగా ఉన్నప్పుడు, అచ్చం ఆమెలాగే పాడాలని ప్రయత్నిస్తూ రికార్డ్ చేసుకుంటాను.

ఒకసారి మా బంధువు ఒకాయన, బయటికి వెళ్లే ముందు అమ్మ కాళ్లకి దండం పెట్టమన్నాడు. మొదట్లో నాకు మొహమాటంగా అనిపించి నవ్వేవాడిని. ఆమె అనేది, "తీస్కో, నా ఆశీర్వాదం తీస్కో."

ఇప్పుడు కొన్నిసార్లు నేనే ఆమెకి పిల్లల్ని పెంచడం గురించి లెక్చర్లు ఇస్తుంటాను. ఏం చేసుండాల్సింది, ఏం చేయకుండా ఉండాల్సిందని చెప్తాను.

ఇప్పుడు ఆమెకి ఇన్‌స్టాగ్రామ్ కూడా ఉంది. నా ప్రవర్తన గురించి రీల్స్ పంపిస్తుంటుంది.

ఆమె వాట్సాప్ ఇంకో తలనొప్పి. గుడి బ్యాచ్ 1, 2, 3, యోగా బ్యాచ్, దాండియా, స్కూల్... ఎన్నో గ్రూపులు. ఆ నోటిఫికేషన్లు చూస్తేనే నాకు చిరాకు వస్తుంది. నేను ఆమె ఫోన్ ముట్టుకున్నా, "చెంప పగులుతది, ఏమన్నా డిలీట్ చేస్తే!" అని హెచ్చరిస్తుంది.

మా అమ్మ ఏం చేస్తుంది అని ఎవరైనా అడిగితే, "గృహిణి, టైలర్" అని చెప్పాలనిపించదు. ఇదంతా చెప్పాలనిపిస్తుంది.

పుట్టినరోజు శుభాకాంక్షలు అమ్మా!

 

 


r/telugu • • 4d ago

మాటామంతీ - discussion ఒక ఆవేదన

12 Upvotes

అసలు తెలుగు కుటుంబాల లో పుట్టి పెరిగి తెలుగు రాకపోవటం అనేది చాలా బాధకారం విషయం

నాకు అసలు చాలా బాధకారం గా అనిపిస్తది తల్లి తండ్రులు అంత English hindi లో మాట్లాడుతున్నారు తమరి పిల్లల తో

నేను ఇక్కడ English Hindi లో మాట్లాడటం ఎ తప్పు కాదు నేను అంటున్నది కానీ మన మాతృ భాష ని నేర్పించకపోవటం పూర్తిగా పక్కకి పడేయ్యటం అనేది బాధాకరమైన విషయం

అసలు హైదరాబాద్ లో తెలుగు ఉండటానికి కారణం రచన ఇంకా కవి తో పాటు ధైర్యవంతు సర్దార్ వల్లభభై పటేల్ హైదరాబాద్ ఇప్పుడు భారత్ దేశం లో ఉంది ఇక్కడ తెలుగు ఉంది , లేకుంటే ఆ నిజాం పరిపాలన అందరు ఉర్దూ ని రుద్దేవారు హైదరాబాద్ అంత , తెలుగు ని ఆ రోజు కాపాడినందుకు వల్ల మేం ఉన్నాం ఇట్లా లేకుంటే లేకపోతుందే ఈ భాష ఇంకా మాకు గర్వం గా ఉండాలి మన మాతృ భాష కి

మన భాష ని మనం కాపాడుకుంటేనే మన దేశం ని మన భూమి ని కాపాడుకోగలం ఎందుకో చెప్పాలనిపించింది చెప్పా

ఇక శుభరాత్రి


r/telugu • • 4d ago

బొమ్మ - photo/video 📷🎥 ఇల్లు ఉంది కానీ, తలుపులు లేవు, లోపల బోలెడన్ని గదులు, కానీ ఒక్కరూ ఉండరు.. ఏంటది?

Post image
70 Upvotes

r/telugu • • 4d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Looking for punchy, everyday Telugu words/slang to vent with (that aren't casteist or gendered slurs)

6 Upvotes

Hey everyone! Recently realized that some everyday Telugu words I casually use to vent (like chandalam) actually have casteist roots, and I really want to drop them from my vocabulary.

The problem is, standard "clean" textbook words feel way too stiff when you're genuinely heated and just want to let off steam. I'm trying to actively practice natural, punchy Telugu words that actually hit hard when venting—without crossing into casteist, misogynistic, or family-insult territory.

What are your go-to Telugu words or expressions for these specific types of people?

  1. Disgusting hygiene / zero civic sense – Someone who has no civic sense or is so unaware of self that they are subjecting others to inconvenience with their lack of hygiene.
  2. Bitter, hostile & grudge-holding – Someone who spreads hostility.
  3. Always dismissive – Someone who chronically disregards, ignores, or looks down on you.
  4. Deliberately pushing your buttons – Someone who knows your exact nature and triggers, and still intentionally does things just to piss you off.

Would love to hear real, everyday words or phrases you guys actually use in real life. Thanks in advance!


r/telugu • • 3d ago

అరగలి - ​ప్రశ్న - question ❓ Telugu mini crossword # 52 - ఒత్తులు ఉపయోగించకూడదు

Post image
1 Upvotes

r/telugu • • 4d ago

మాటామంతీ - discussion మా పాప కోసం చూ, చే, చో, లా అక్షరాలతో మొదలయ్యే మంచి తెలుగు పేర్లు సూచించగలరా? అర్థవంతంగా, అందంగా ఉండే పేర్లు చెబితే మాకు చాలా సంతోషంగా ఉంటుంది.

Post image
5 Upvotes

r/telugu • • 4d ago

కవిత - poetry 🪶 అంతరంగం

3 Upvotes

నా అనుకునే నీవాళ్ళ అంతరంగం నీకే తెలీదు బహుషా!

పరస్పర ఇష్టాల అంతర్యుద్ద రణరంగం నీలోనే..తెలుసా!!

నీ భావాలు.. వాళ్లే అపహాస్యం చేస్తే కాస్త కష్టమేనే మనసా!

ఒక్క మాటలో.. మనోభావాలు వదిలేస్తేనే బతుకు కులాసా!!