r/andhra_pradesh • u/litetisko • 13h ago
💬చర్చ - Discussion ఐఏఎస్ అధికారి కోపానికి ఐదుగురు సిబ్బంది ఉపాధి గల్లంతు!
విజయవాడ బైపాస్ పరిధిలోని వెంకటపాలెం టోల్ ప్లాజా వద్ద గురువారం చోటుచేసుకున్న ఘటనలో ఐదుగురు చిరుద్యోగులు తమ ఉపాధిని కోల్పోయారు.సీఎంవో కార్యదర్శి ఐఏఎస్ కార్తికేయ మిశ్రా ప్రయాణిస్తున్న వాహనం టోల్ వద్దకు రాగా, ఫీజు లేకుండా గేటు ఎత్తాలని ఆయన డ్రైవర్ సిబ్బందిని కోరారు. కారు ముందు భాగంలో అధికారిక ఫ్లాగ్ లేకపోవడం, డ్రైవర్ స్పష్టంగా వివరించకపోవడంతో ఆయన్ని టోల్ సిబ్బంది గుర్తించలేకపోయారు.టోల్ మినహాయింపు నిబంధనల ప్రకారం గుర్తింపు కార్డు (ID) చూపించాలని వారు అడగడంతో మిశ్రా ఒక్కసారిగా అసహనానికి లోనయ్యారు.
• సీఎంవో అధికారి అని తెలిపినా ఐడీ కార్డు అడుగుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన, టోల్ ఇన్ఛార్జి తక్షణమే క్షమాపణలు కోరినా శాంతించలేదు.కేవలం సారీ చెబితే సరిపోదని, తానెవరో చూపిస్తానంటూ హెచ్చరించి దాదాపు 10 నిమిషాల పాటు అక్కడే కారులో ఉండిపోయారు.
• అనంతరం ఎన్హెచ్ఏఐ (NHAI) ప్రతినిధులను, టోల్ నిర్వాహకులను తన కార్యాలయానికి పిలిపించి.. ఘటన సమయంలో డ్యూటీలో ఉన్న ప్రతి ఒక్కరినీ తొలగించాలని హుకుం జారీ చేశారు.
• కావాలని కారు ఆపలేదని నిర్వాహకులు వివరణ ఇచ్చినా ఆయన వినకపోవడంతో ముగ్గురు టోల్ కలెక్టర్లు, ఒక సూపర్వైజర్, షిఫ్ట్ ఇన్ఛార్జిని గురువారమే విధుల నుంచి తప్పించారు.